తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక “గద్దర్ అవార్డు”ను సొంతం చేసుకున్న ఇగ్వా తెలుగు చిత్రం
తెలుగు సినీ పరిశ్రమకు మరో గర్వకారణంగా ఐగ్వా చిత్రం నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డు లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎగ్వా చిత్రం విజేతగా నిలిచింది.
ఈ చిత్రానికి దర్శకుడు వి. కె. రాజు దర్శకత్వం వహించగా, పూర్ణ బట్టు నిర్మించారు. గ్రామీణ భావోద్వేగాలు, మానవీయ విలువలు, సమాజానికి సంబంధించిన సున్నితమైన అంశాలను హృదయానికి హత్తుకునే విధంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
దేశీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా “ఐగ్వా” తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ చిత్రం ఇప్పటికే 50కి పైగా అంతర్జాతీయ అవార్డులను అందుకుని తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకువచ్చింది.
ఈ సందర్భంగా దర్శకుడు వి. కె. రాజు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డు అందుకోవడం మా టీమ్‌కు ఎంతో గర్వకారణం. మా కథను ఆదరించిన ప్రేక్షకులకు, జ్యూరీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.
నిర్మాత పూర్ణ బట్టు మాట్లాడుతూ సినిమాపై నమ్మకంతో చేసిన మా ప్రయత్నానికి ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటిన ‘ఐగ్వా’కు ఇది మరో గొప్ప మైలురాయి” అన్నారు.
“ఐగ్వా” సాధించిన ఈ విజయం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తోంది.